పవన్‌ కళ్యాణ్ దెబ్బతిన్న పులిలా వస్తున్నాడు - పరుచూరి గోపాలకృష్ణ

పవన్‌ కళ్యాణ్ దెబ్బతిన్న పులిలా వస్తున్నాడు - పరుచూరి గోపాలకృష్ణ

మూవీ రిపోర్ట్- పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురించి ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ వ్యక్తిత్వం, ఆయన స్పీచ్‌ లపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలిపారు. సొసైటీ మారాలని పవన్‌ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన చెప్పారుఒకరి చేతుల్లోనే అధికారం ఉండకూడదు..సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం చేతులు మారుతుండాలి..  అందుకే గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశారు.. ఆ ఫలితాలతో నిరాశ చెందకుండా దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నారు.. ఓటింగ్‌ అనేది ఒక పెద్ద రాజకీయ తంత్రం.. పాలిటిక్స్‌లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి..

అలాగే సమాజం గురించి రాజకీయ నాయకుడు చెబితే వినేవారికంటే.. సినిమా నటుడు చెబితే వినేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు.. పవన్‌ కళ్యాణ్ బాగుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని.. అని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సినిమాలు చేయడం ఆపేయవద్దని ఎప్పటికీ కొనసాగించాలని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ను పరుచూరి కోరారు. టైం లేకపోతే ఎన్టీఆర్‌ లాగా అప్పుడప్పుడైనా సినిమాల్లో కనిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్‌ కళ్యాణ్ కోరుకున్నది ఆయనకు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.