మరోసారి స్క్రీన్ ను పంచుకోబోతున్న ప్రభాస్‌ - అనుష్క

మరోసారి స్క్రీన్ ను పంచుకోబోతున్న ప్రభాస్‌ - అనుష్క

మూవీ రిపోర్ట్- సినిమా (Cinema) ఇండస్ట్రీలో కొంత మంది హీరో, హీరోయిన్ల జోడీకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. సినిమా భాషలో చెప్పాలంటే ఇద్దరికీ బాగా కెమిస్ట్రీ కుదురింది అంటారు. ప్రభాస్ (Prabhas).. అనుష్కలది ((Anushka)) అలాంటి జోడీ అని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రభాస్, అనుష్కలు కలిసి మొత్తం మూడు సినిమాల్లో కలిసి నటించారు. ఇదిగో ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై కనిపించనుందని తెలుస్తోంది. ప్రభాస్, అనుష్క మళ్లీ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారన్న వార్త సోషళ్ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రభాస్, అనుష్కల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభాస్ సినిమా బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్ (Shobu Yarlagadda) ప్రభాస్, అనుష్కలతో ఓ భారీ బడ్జెట్‌ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్‌ తో మూవీకి సంబందించిన చర్చలు కూడా జరిపారని, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ఐతే ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేద. ప్రభాస్, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తో కలిసి సలార్‌ (Salaar) మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.