అందుకే సీఎం యోగి కాళ్లు మొక్కాను - రజనీకాంత్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు పాదాభివందనంపై క్లారిటీ

అందుకే సీఎం యోగి కాళ్లు మొక్కాను - రజనీకాంత్‌

స్పెషల్ రిపోర్ట్-  సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) పై ఓ చిన్న వివాదం చలరేగుతోంది. అందుకు కారణం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాధ్ CM (Yogi Adityanath) అని చెప్పాలి. రజనీకాంత్ తాజా సినిమా జైలర్ (Jailer)  హిట్టవ్వడంతో గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు. తనకిష్టమైన పుణ్యక్షేత్రాలను తిరిగివచ్చారు రజనీకాంత్. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ తో కలిసి జైలర్‌ సినిమా చూశారు రజనీ. ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి ఎందుకో ఏమోగాని సీఎం యోగీకి పాదాభివందనం చేశారు రజనీకాంత్. ఇలా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ముఖ్యమంత్రి యోగీ కాళ్లు మొక్కడమేంటన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు ఆయనపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ విషయంపై రజనీకాంత్ అభిమానులకు, ట్రోలర్స్‌కు మధ్య రెండు రోజుల నుంచి ట్వీట్స్‌ యుద్ధమే జరుగుతోంది. ఇక చేసేది లేక ఈ అంసంపై రజనీకాంత్‌ తాజాగా స్పందించారు. స్వామిజీలు, యోగులు కనిపించినప్పుడు తాను వెంటనే వాళ్ల కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకుంటానని ఆయన చెప్పారు. వాళ్లు నాకంటే వయసులో పెద్ద వారా లేదా అని కూడా చూడనని, అది నా పద్ధతి అని చెన్నై ఎయిర్ పోర్ట్ లో క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్. అన్నట్లు రజనీకాంత్‌ నటించిన జైలర్‌ సూపర్‌ డూపర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. చాలారోజుల తర్వాత రజనీకాంత్ తన స్టైల్‌ తో, డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్‌ చేసింది జైలర్ సినిమా. Jailer Movie Collections