నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు - రజనీకాంత్‌

చంద్రబాబు ఎప్పుడూ తప్పుచేయరు-లోకేశ్‌కు రజనీ ఫోన్

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు - రజనీకాంత్‌

చెన్నై రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు (Chandrababu)పై సూపర్ స్టార్, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు (Nara Lokesh) ఫోన్‌ చేసి మాట్లాడారు రజనీకాంత్. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని లోకేశ్‌ తో అన్నారు తలైవా. లోకేశ్ తో రజనీకాంత్ ఎమన్నారో ఆయన మాటల్లోనే... నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు.. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు.. చేసిన మంచి పనులు, ప్రజాసేవే ఆయనను బయటకు తీసుకొస్తాయి.. అని రజనీకాంత్‌ లోకేశ్ కు ధైర్యం చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ప్రముఖ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ (Ashwini Dutt) ఖండించారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారని కామెంట్ చేశారు. ది గ్రేట్‌ చంద్రబాబు నాయుడు గారిని ఇంత దుర్మార్గంగా అరెస్ట్‌ చేసిన వారెవరికీ పుట్టగతులుండవు.. దీనికి పరిష్కారం త్వరలోనే ఉంది.. మూడు, నాలుగు నెలల్లో ఎన్నకలు రాగానే వారు శిక్ష అనుభవిస్తారు.. 175 సీట్లలో 160 కచ్చితంగా చంద్రబాబు గెలుస్తారు.. అని నిర్మాత అశ్వనీదత్‌ వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురువాతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కలవబోతున్నారు.