నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

సెప్టెంబర్‌ 15న పరీక్ష, 27న ఫలితాలు

నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

స్పెషల్ రిపోర్ట్- టీచింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష - టెట్ 2023 (TS TET 2023) కు సంబందించిన నోటిఫికేషన్‌ ను మంగళవారం విడుదల చేసింది ప్రభుత్వం. టెట్ పరీక్ష కోసం ఆగస్టు 2 నుంచి 16 వరకు ఆన్‌ లైన్‌ లోఅప్లై చేసుకోవచ్చు.  అప్లికేషన్ ఫీజు 400 రూపాయలు. సెప్టెంబర్‌ 15న టెట్ () పరీక్ష నిర్వహించి, అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్‌ 15న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌1, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ పేపర్‌ 2 పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 9 వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ టెట్ పరీక్షకు సంబందించిన పూర్తి వివరాలు https://tstet.cgg.gov.in/   వెబ్‌ సైట్‌ లో సందర్శించి తెలుసుకోవచ్చు. Telangana TET Notification 2023