ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె గ్లింప్స్‌ వచ్చేసింది.. సినిమా టైటిల్ అదిరిపోయింది

ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె గ్లింప్స్‌ వచ్చేసింది.. సినిమా టైటిల్ అదిరిపోయింది

సినిమా డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా ప్రాజెక్ట్‌ కె (వర్కింగ్‌ టైటిల్‌) (Project K) గ్లింప్స్‌ ఎట్టకేలకు వచ్చేసింది. మరోవైపు ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేసింది చిత్రబృందం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.. అప్పుడు అంతం అరంభమవుతుంది.. అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. 

వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కె అనే ఒక్క డైలాగ్‌ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గ్లింమ్స్ లో విజువల్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అనుకున్నట్లుగానే ప్రభాస్‌ లుక్‌ వావ్ అనిపిస్తుంది. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక శాన్‌ డియాగో కామిక్ కాన్‌ (San Diego Comic Con) వేడుకలో చిత్ర బృందం గ్లింప్స్‌, టైటిల్‌ ని అనౌన్స్ చేసింది. సోషల్‌ మీడియాలో గ్లింమ్స్ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. అమెరికాలో జరిగిన వేడుకతో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా ఇది రికార్డుల్లోకెక్కింది. ప్రభాస్‌ (Prabhas), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), దగ్గుబాటి (Rana Daggubati), నిర్మాత అశ్వనీదత్‌ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు.

డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) మహానటి సినిమా తరువాత తెరకెక్కిస్తున్న మూవీ ఇది. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో అందాల భామ దిశా పటానీ (Disha Patani) కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) లు కీలక పాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి.