అమెరికాలో హైదరాబాద్‌ వివాహిత బలవన్మరణం

ఎల్బీనగర్‌కు చెందిన మహిళ ఆత్మహత్యకు

అమెరికాలో హైదరాబాద్‌ వివాహిత బలవన్మరణం

ఇంటర్నేషనల్ రిపోర్ట్- అమెరికాలో (America) హైదరాబాద్ కు చెందిన మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఎల్బీనగర్‌ కు చెందిన ఓ వివాహిత అనారోగ్యంతో అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండల పరిధిలోని అమ్మనబోలుకు చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతులు ఎల్బీనగర్‌ కామినేని వెనుక ఉన్న సూర్యోదయ కాలనీలో నివాసమంటున్నారు. వీరి కుమారుడు ఏనుగు శ్రీనివాస్‌రెడ్డికి  కవిత (Kavitha) (40) తో 18ఏళ్ల క్రితం పెళ్లైంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి మిస్సోరిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కవిత అనారోగ్య సమస్యలతో ఉరి వేసుకుని బలవర్మరణానికి పాల్పడింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. కవిత మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.