ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఊరట
వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో స్టే ఇచ్చిన హైకోర్టు
అమరావతి- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ Pawan Kalyan) కు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యల క్వాష్ చేయాలని పవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేవవలం ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు విచారణపై స్టే విధిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట లభించింది.
