Prudhvi Raj

బ్రో సినిమాలో శ్యాంబాబు.. ఇప్పుడు శోభన్ బాబు.. బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన పృథ్వీ

మూవీ రిపోర్ట్- సినీ నటుడు, కమెడియన్‌ పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) బ్రో సినమాలో పోషించిన శ్యాంబాబు (Shyambabu) పాత్రపై రాజకీయ దుమారం రేగుతున్న సంగతి చెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharamtej) కీలక పాత్రల్లో, సముద్రఖని డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రో’ (BRO Movie). ఈ మూవీలో నటుడు, కమెడియన్‌ పృథ్వీ.. శ్యాంబాబు పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైన దగ్గరి నుంచి శ్యాంబాబు పాత్రకు మంచి క్రేజ్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఐతే కేవలం తనను కించపరిచేందుకే ఆ పాత్ర పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఐతే బ్రో మూవీ యూనిట్బృం ఆ పాత్ర అంబటి రాంబాబుది అని ఎక్కడా చెప్పడం లేదు. తాజాగా వాల్తేరు వీరయ్య 200 రోజుల కార్యక్రమంలో చిరంజీవి సైతం ఏపీ రాజకీయనాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, వాటికి మంత్రులు, వైసీపీ నాయకుల కౌంటర్‌ ఇవ్వడంతో వివాదం పెద్దదవుతోంది

ఇటువంటి సమయంలో నటుడు పృధ్వి మరో ఆసక్తికరమై విషయాన్ని చెప్పారు. ప్రముఖ రచయిత, దర్శకుడు తనకు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారని అన్నారు. ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, తాను చేయబోయే ఈ సినిమా శోభన్‌బాబు (Shobhan Babu) లో రెండు గంటల మేర పాత్ర ఉంటుందని తెలిపారు. తనకు అద్భుతమైన అవకాశం వచ్చిందని, ఆ రచయిత, దర్శకుడు ఎవరు.. ఏ బ్యానర్‌ లో సినిమా చేస్తున్నాను.. తదితర వివరాలను త్వరలోనే చెప్తానని అన్నారు పృధ్వి. ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీ.. అంటూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పృధ్వి. మరి ఈ సినిమా ఎన్ని వివాధాలు సృష్టిస్తుందో చూడాలి.


Comment As:

Comment (0)