కేరళలో అమెరికా మహిళపై సామూహిక అత్యాచారం
కేేరళ రిపోర్ట్- అగ్ర రాజ్యం అమెరికా (America) నుంచి కేరళకు (Kerala) వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి గురైన ఘటన కలకలం రేపుతోంది. అమెరికాకు చెందిన 44 ఏళ్ల మహిళ కొల్లంలోని (Kollam) ఓ ఆశ్రమానికి జులై 22న వచ్చింది. ఈ క్రమంలో జులై 31న ఒంటరిగా సమీపంలోని సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు సిగరెట్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఐతే ఆమె దానిని తీసుకోవడానికి తిరస్కరించడంతో కనీసం మద్యంc(Rum) తీసుకోవాలని అడిగారు.
అందుకు అంగీకరించిన ఆమె వాళ్లిచ్చిన మద్యం తీసుకున్నాక మత్తులోకి వెళ్లిపోయింది. అమెరికా మహిళ మత్తులోకి వెళ్లగానే ఆ వ్యక్తులు ఆమెను బైక్ పై పక్కనే ఉన్న ఖాళీ ఇంటిలోకి తీసుకుపోయారు. ఆ తరువాత ఆ వ్యక్తులిద్దరు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధిత అమెరికా మహిళ ఈ నెల 1న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.