Bramhanandam

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు

అంగరంగవైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం

స్పెషల్ రిపోర్ట్- ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం (Bramhanandam) చిన్న కుమారుడు సిద్ధార్థ (Sidharth) వివాహం ఘనంగా జరిగింది. నగరానికి చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో శుక్రవారం రాత్రి ఆయన ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌ లోని అన్వయ కన్వెన్షన్స్‌ సిధ్దార్థ, ఐశ్వర్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్,  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, మోహన్‌ బాబు,రామ్‌చరణ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వీదేశాల్లో చదువుకుని ప్రస్తుతం బిజినెస్ లో సెటిల్ అయ్యాడు. తన ఇద్దరు కుమారులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని బ్రహ్మానందం ఎంత ప్రయత్నించినా.. సఫలం కాలేదు. పెద్ద కుమారుడు గౌతమ్ ఒకటి రెండు సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు. brahmanandam son siddharth marriage


Comment As:

Comment (0)