Revanth Cm

సీఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి

RRR తెలంగాణకు లైఫ్ లైన్- సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రిపోర్ట్- రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు.. లాభదాయకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందుకే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చెప్పారు. గత పాలకుల నిర్ణయాలు, విధానాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడతాయని రేవంత్ రెడ్డి అన్నారు. అవుటర్‌ రింగు రోడ్డు అవసరమా అని గతంలో చాలా మంది అన్నారని.. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ హైదరాబాద్, తెలంగాణకు లైఫ్‌లైన్‌గా మారిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

 


Comment As:

Comment (0)