ఆమె నన్ను తాకరాని చోట తాకింది.. చాలా ఇబ్బందిపడ్డాను- దుల్కర్ సల్మాన్
మూవీ రిపోర్ట్- సినిమా తారలు తమ అభిమానుల వ్లల కొన్ని సార్లు ఇబ్బందిపడుతుంటారు. ఇదిగో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గుర్తుచేసుకున్నారు. సీతారామం సినిమా (Sita Ramam movie) తరువాత తనకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పారు దుల్కర్ సల్మాన్. మామూలుగా ఐతే తనకు జెంట్స్ లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారని, అభిమానుల వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పారు. కొంత మంది మహిళా అభిమానులు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని ప్రయత్నిస్తుంటారని చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. కొన్ని సార్లు వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయానని అన్నారు.
గతంలో ఒక పెద్దావిడ వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని, ఆమె తనను తాకరాని చోట అభ్యంతరకరంగా తాకిందని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని దుల్కర్ సల్మాన్ చెప్పారు. ఇక తనకు 28 ఏళ్ల వయసులోనే పెళ్లైందని తెలిపారు. తన భార్య అమాల్ సోఫియా (Amal Sufiya), తాను ఒకే స్కూల్‌లో చదువుకున్నామని.. తనని చూసినప్పుడే ఆమె నా జీవితం, కుటుంబంలో భాగమని అర్దమైందని చెప్పారు దుల్కర్ సల్మాన్.