మందు తాగుతూ విమానం నడిపి.. చివరికి గాల్లోనే
ఇంటర్నేషనల్ రిపోర్ట్- మందు తాగి వాహనాలు నడిపితేనే ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిది మధ్యం తాగి విమానం నడిపితే ఇంకేమైనా ఉందా? ఇదిగో ఇలా మందు తాగి విమానం నడిపినందుకు బ్రెజిల్ (Brazil) లో పెద్ద ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలను బలయ్యాయి. బ్రెజిల్ కు చెందిన గారన్ మైయా (Garon Maia) అనే వ్యక్తి 11 ఏళ్ల కుమారుడు ఫ్రాన్సిస్కో మైయాను (Francisco Maia) క్యాంపో గ్రాండేలో ఉండే తన భార్య వద్ద దిగబెట్టేందుకు ఓ ప్రైవేటు విమానంలో వెళ్లాడు. రొండోనియాలోని నోవా కాంక్విస్టా నుంచి విమానం బయలుదేరింది.
విమానం నడపాల్సిన తండ్రి మద్యం తాగుతూ, విమానం ఎలా నడపాలో కొడుకుకు సూచనలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కొద్ది సేపటికే ఆ విమానం ప్రమాదానికి గురై గాల్లో చక్కర్లు కొట్టి కూలిపోయింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ఇద్దరూ చనిపోయారు. భర్త, కొడుకు మరణవార్త విన్న అనా ప్రిడోనిక్ తీవ్ర మనోవేదనకు గురైంది. వారి అంత్యక్రియల పూర్తైన తరువాత తుపాకీతో కాల్చుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. జులై 29న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకే మధ్యం తాగి వాహనాలనే కాదు విమానాలను నడపకూడదు. అది ప్రమాదకరం.