KCR CM EX

యశోద ఆస్పత్రిలో కేసీఆర్ కు శస్త్ర చికిత్స

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు గాయం.. 

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (Ex CM KCR) ఆస్పత్రిలో చేరారు. ఫామ్ హౌజ్ లో కాలుజారి పడటంతో ఆయన తుంటికి గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్ కు శస్త్రచికిత్స నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయనను చూసేందుకు ఎవరు ఆస్పత్రికి రావద్దని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్దించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు గాయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అధికారులను అడిగి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు తెలుకున్నారు. 


Comment As:

Comment (0)