VH Revanth

అన్నివిధాలుగా అండగా ఉంటామని వీహెచ్ కు రేవంత్ భరోసా

సీఎం రేవంత్ తో బేటీ తరువాత అలక వీడిన వీహెచ్..

గత కొన్ని రోజులుగా అలకబూనిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు (VH) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించిన వీహెచ్.. తనకు ఎంపీ టిక్కెట్ దక్కే అవకాశం లేదన్న సంకేతాలతో అలిగారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాదు సీఎం రేవంత్ ను కలిసే అవకాశమే దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ అసంతృప్తి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్ గౌడ్‌తో మాట్లాడారు. బుధవారం వీహెచ్ ను సీఎం వద్దకు తీసుకెళ్లారు మహేష్ కుమార్గౌడ్. దీంతో కాస్త మెత్తబడ్డారు వీహెచ్. వీహెచ్‌కు అన్నివిధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీహెచ్ తో చర్చించారు రేవంత్ రెడ్డి. 


Comment As:

Comment (0)