నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో హాయ్ నాన్న

గుండెలకు హత్తుకునేలా “హాయ్‌ నాన్న” టీజర్‌

మూవీ రిపోర్ట్- నాచురల్ స్టార్ నాని (Nani) తండ్రి పాత్రలో నటిస్తోన్న ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ హాయ్‌ నాన్న (Hi Nanna). సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా, శ్రుతిహాసన్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతున్న హాయ్‌ నాన్న మూవీకి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. సరదాగా సాగుతోన్న తండ్రీ కుమార్తెల జీవితంలోకి ఒక యువతి ప్రవేశించడం, అతడితో ఆమె లవ్ లో పడటం వంటి సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు. ఓ వైపు కూతురు, మరోవైపు యువతి మధ్య సాగే సెంటిమెంట్ కధాంశంతో తెరకెక్కించారు హాయ్ నాన్న మూవీని. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా హాయ్ నాన్న టీజర్ చూసేయండి.


Comment As:

Comment (0)