Hyd Crime

హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం 

పూజల పేరుతో మహిళపై నకిలీ బాబా లైంగిక దాడి

హైదరాబాద్ క్రైమ్ రిపోర్ట్- ఈ ఐటీ యుగంలోను ఇంకా మూడనమ్మకాలను నమ్ముతున్నారు చాాలా మంది. ఇలా ముడనమ్మకాలకు హైదరాబాద్ లోని పాతబస్తీలోని ఓ మహిళ జీవితం నాశనం అయ్యింది. దెయ్యాలు వదిలిస్తానని నమ్మబలికిన ఓ నకిలీ బాబా కొత్తగా పెళ్లైన ఓ మహిలపై పూజల పేరుతో  లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ హుస్సేనిఆలంకు (Hussainialam) చెందిన ఇంటర్‌ విద్యార్థిని (21)కి తలాబ్‌కట్ట భవానీనగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తితో మూడు నెలల క్రితం పెళ్లైంది. అత్తారింటికి వచ్చిన కొన్ని రోజులకే ఆమెకు అనారోగ్యం చేసింది. దుష్టశక్తులు ఆవహించాయన్న అనుమానంతో తల్లి సూచన మేరకు భర్త ఆమెను బర్కత్‌పురలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో పాతబస్తీ బండ్లగూడ రహ్మత్‌నగర్‌ లోని మరో మాంత్రికుడు మజహర్‌ఖాన్‌ (mazhar khan) (30)  దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమెను మొత్తం ఐదు దెయ్యాలు ఆవహించాయని, వాటిని వదిలించేందుకు పూజలు చేయాలని చెప్పాడా మాంత్రికుడు.

ఈ క్రమంలో ఓ రోజు తలాబ్‌కట్టకు వచ్చి బాధితురాలి ఇంటిని పరిశీలించాడు. ఆ తరువాత రెండు రోజులకు తన ఇంటికి రావాలని చెప్పాడు. బాధితురాలు తన భర్తతో కలిసి బండ్లగూడలోని నకిలీ బాబా ఇంటికి వచ్చింది. ఆమె నడుము చుట్టూ దారం కట్టాలని, కళ్లకు గుడ్డ కట్టాలని భర్తకు చెప్పాడు. అలా చేసి పూజలంటూ భర్తను బయటకు పంపించేశాడు. బాధితురాలిని పడుకోబెట్టి శరీరంపై నూనె వేసి మర్దనం చేశాడు. తరువాత వివస్త్రను చేసి శరీరం అంతా నూనె రాస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత పాలతో ఆమె శరీరం కడిగి నూతన వస్త్రాలు ధరించాలని చెప్పాడు. ఇక్కడ జరిగిన పూజ విషయాలు ఎవరికీ చెప్పొద్దని, అనర్థాలు జరుగుతాయని ఆమె భయపెట్టాడు. ఇంటికి వెళ్లిన బాధితురాలు కుటుంబ సభ్యులకు మొత్తం చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే వద్దంటూ ఆమెను ఓ గదిలో బంధించారు. పది రోజుల తరువాత ఇంటికి వచ్చిన సోదరికి విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ బాబాకు అప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా, ఇలా పూజల పేరుతో చాలా మందిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.


Comment As:

Comment (0)