పోలీసుల అధుపులో చందన, ఉమర్
దీప్తి హత్య కేసులో చెల్లెలు చందన, ప్రియుడే హంతకులు
క్రైం రిపోర్ట్- తెలంగాణలో సంచలనం రేపిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి (deepti) హత్య కేసులో ఆమె చెల్లే దోషి అని పోలీసులు తేల్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల (Korutla Murder) హత్య కేసులో ప్రధాన నిందితులు చందన (Chandana), ఆమె ప్రియుడేనని తేలింది. ఆర్మూరు బాల్కొండ రోడ్ లో నిందితులు కారులో పారిపోతున్నారన్న సమాచారంతో కోరుట్ల సీఐ ప్రవీణ్ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను విచారించగా వారు చేసిన దారుణమైన నేరం ఒప్పుకున్నారు. దీప్తి చెల్లెలు బంక చందన 2019 లో హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ జాయిన్ అయ్యింది. ఈ క్రమంలో అదే కాలేజీలో చదివిన హైదరాబాద్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ (omar sheikh sultan) చందనకు పరిచయమవ్వగా, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఈ క్రమంలో గత నెల 19న ఉమర్ కోరుట్ల వచ్చి చందనతో పెళ్లి విషయం చర్చించాడు. ఈ సందర్బంగా ఇద్దరం లైఫ్ లో సెటిల్ కాలేదు, పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలని ఉమర్ చెప్పాడు. ఆ తరువాత ఉమర్ కు కాల్ చేసి చందన.. ఇంట్లో నేను మా అక్క మాత్రమే ఉన్నాం.. కోరుట్ల రావాలని చెఆహ్వానించింది. దీంతో ఉమర్ 28వ తేదీ ఉదయం కోరుట్ల వచ్చాడు. ముందే అనుకున్న పధకం ప్రకారం చందన.. దీప్తి కోసం వోడ్కా , బ్రీజర్ తెప్పించింది. సోమవారం రాత్రి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకున్నారు. దీప్తి నిద్ర పోయిన తరువాత ఉమర్ కు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చాడు.
ఇద్దరు కలిసి ఇంట్లో బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా మెలకువ వచ్చిన దీప్తి చూసి గట్టిగా అరిచింది. దీంతో దీప్తి మెడకు చున్నీ చుట్టి వెనక్కి లాగారు. అయినా అరుస్తుండటంతో ఉమర్, చందన గట్టిగా పట్టుకుని.. దీప్తి ముఖానికి చున్నీ చుట్టి, మూతి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు. పది నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 1.20లక్షల నగదు, 70 తులాల బంగారం తీసుకుని ఇంటి నుంచి పారిపోయారు. వెళ్లిపోయే ముందు దీప్తి మూతికి చుట్టిన ప్లాస్టర్ తీసేసి నాచురల్ డెత్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసి హైదరాబాద్ పారిపోయారు. అక్కడి నుంచి నాగ్‌పూర్ వెళ్తుండగా ఆర్మూర్ రోడ్డులో శనివారం ఉదయం నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.