Mother In Law Kidney Doner

కోడలి కోసం కిడ్నీ త్యాగం చేసిన అత్త

కోడలి కోసం అత్త చేసిన గొప్ప త్యాగం..

స్పెషల్ రిపోర్ట్- సమాజంలో సాధారణంగా అత్తా కోడళ్లు అంటే గొడవలు, మనస్పర్ధలు మాత్రమే గుర్తకువస్తాయి. అత్తాకోడళ్ల మధ్య మంచి సంబంధం, ప్రేమాభిమానుల కలిగి ఉండటం అనేది చాలా అరుదని చెప్పాలి. అసలిప్పుడు అత్తాకోడళ్లు కలిసి ఎక్కడు ఉంటున్నారు చెప్పండి. కానీ ఓ అత్త మాత్రం అందుకు భిన్నంగా కోడలిపై అమితమైన ప్రేమను చూపించింది.

 ప్రభా కాంతిలాల్ మోటా (70) (Prabha Kantilal Mota) ముంబయిలో నివసిస్తుండగా, ఆమె కోడలు అమిషా మోటా (Ameesha)కు ఆనారోగ్యం కారణంగా కిడ్నీ (kidney) పాడైంది. అమిషా భర్త జితేష్ మోటా (Jitesh Mota) కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆయనకు డయాబెటిస్‌ ఉండటంతో ఆయన ఆరోగ్య రీత్యా డాక్టర్లు వద్దని చెప్పారు. ఈ క్రమంలో ప్రభా తన కిడ్నీని కోడలికి ఇస్తానని చెప్పడంతో ఆమె కుమారులు భయపడ్డారు. ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యులు, వైద్యులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా ఆమె కిడ్నీ ఇవ్వడానికి ఆ మాత్రం సంకొచించలేదు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, మీరు భయపడవద్దని ధైర్యం చెప్పింది. అంతే కాదు అమిషా తన కోడలు మాత్రమే కాదని, నా కూతురు అని చెప్పింది. బిడ్డ ఆరోగ్యం కంటే తల్లికి ఏది ముఖ్యం కాదని తన ప్రేమను చాటుకుంది.

 ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో (Nanavati Hospital) ఆగస్టు 1న ప్రభా తన కోడలు అమిషాకు కిడ్నీను దానం చేసింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్‌ చేసుకుంది. నా 44 ఏళ్ల వైద్య వృత్తి లో చాలామంది అవయవ దాతలు తమ పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు ఇస్తారు.. కానీ అత్త, కోడలికి కిడ్నీని దానం చేయడం అరుదు.. ఆమె అత్తలందరికీ ఆదర్శం.. అని ఈ సందర్భంగా ప్రభా కాంతిలాల్‌ వ్యక్తిగత డాక్టర్‌ చంద్రకాంత్‌ (Dr Chandrakant Lallan) అన్నారు. మొత్తానికి అత్త, కోడలి కోసం కిడ్నీని దానం చేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Comment As:

Comment (0)