Gurvender Nath

విదేశాల్లో ఉంటున్న కొడుకు మరణవార్త విని కోమాలోకి వెళ్లిన తల్లి

కొడుకు మరణ వార్త వినగానే ఆగిన తల్లి గుండె

నేషనల్ రిపోర్ట్- ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన కొడుకు అకాల మరణంతో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఓవైపు ఈ మరణంతో వారి ఇంట్లో విషాదాన్ని నింపితే ఇప్పుడు అదే కుటుంబంలో మరో హృదయ విదారక ఘటన చోటుచేసుకోవడం అందరిని కలిచివేస్తోంది. కెనడా (Canda)లో ఉన్న విద్యను అభ్యసిస్తూనే పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గుర్‌ విందర్‌ నాథ్‌ (Gurvinder Nath) అనే విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న చనిపోయాడు.

కుటుంబసభ్యులు గుర్‌ విందర్‌ మరణం గురించి అతడి తల్లి నరీందర్ కౌర్ (Narinder Kour) కు చెప్పకుండా దాచారు. ఐతే చివరికి శుక్రవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ (Delhi Airport) కు గుర్‌విందర్‌ మృతదేహాన్ని తరలించిన సమాచారం నరీందర్‌ కౌర్‌కు తెలిసిపోయింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురై కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. శనివారం ఉదయం 11 గంటలకు గుర్ విందర్‌, నరీందర్‌ కౌర్‌ ఇద్దరి అంత్యక్రియలు జరిపారు. తల్లీ, కుమారుడి మరణంతో ఆ కుటుంబమంతా కన్నీరుమున్నీరవుతోంది.

 

 


Comment As:

Comment (0)