బ్రో..రివ్యూ- పవన్, సాయిధరమ్ తేజ్‌ల సినిమా ఎలా ఉందంటే..
సినిమా- బ్రో (BRO Movie Review in telugu)
తారాగణం- పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు
మ్యూజిక్- తమన్
సినిమాటోగ్రఫీ- సుజీత్ వాసుదేవ్
ఎడిటింగ్- నవీన్ నూలి
రచన- సముద్రఖని, శ్రీవత్సన్, విజ్జి
స్క్రీన్‌ప్లే, మాటలు- త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం- సముద్రఖని
బ్రో (BRO).. పరిచయం..... (BRO Movie Review in telugu)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే అభిమానులకు పూనకాలే. అందులోను తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి నటిస్తున్నారంటే ఇక చెప్పేదేముంది ఫ్యాన్స్ కు డుబుల్ ధమాకా. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా వినోదయసిత్తం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు అదే సినిమాను పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో బ్రో (BRO Movie) మూవీగా రీమేక్ చేశారు. మాటల మాంత్రీకుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram Srinivas) ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది.. ఒరిజినల్ తమిళ సినిమా వినోదయసిత్తం లో ఏయే మార్పులు చేశారు..
బ్రో.. కధ.. (BRO Movie Review in telugu)
మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధరమ్ తేజ్) తండ్రి మరణం తరువాత ఇంటికి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతల్నీ తాను తీసుకుంటాడు. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడి భవిష్యత్తు కోసం, ఉద్యోగంలో తాను మరింత ఎత్తుకు ఎదగాలని కష్టపడి పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఊహించని రీతిలో ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. ఐతే తన కుటుంబం జీవితంలో స్థిరపడలేదని, తాను చేయాల్సిన ఎన్నో పనులు ఇంకా మిగిలే ఉన్నాయని, తన జీవితానికి ఇంత తొందరగా ముగింపునివ్వడం అన్యాయమని కాలం (పవన్‌కల్యాణ్) అనే దేవుడి ముందు కన్నీరుమున్నీరవుతాడు. దీంతో కాలం అనుగ్రహించి 90 రోజులు అతని జీవితకాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్న పనులు చేశాడా.. ఆ 90 రోజుల సమయంలో ఏం తెలుసుకున్నాడన్నది బ్రో అసలు కధ.
బ్రో.. ఎలా ఉందంటే.. (BRO Telugu Movie Review)
పవన్‌కల్యాణ్ సినిమా అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పటికప్పుడు అభిమానులకి కిక్ ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. పవన్ కల్యాణ్ గత సినిమాల్లోని పాటలు, ఆయన మేనరిజమ్స్, ఆయన గెటప్స్‌ని పక్కాగా సినిమాలోని సన్నివేశాలకి తగ్గట్టుగా మలిచారు. అవి ఆయన అభిమానులతో ఈలలు కొట్టించేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ ఆయన భావాలు, రాజకీయ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉంటాయి. పవన్ పోషించిన పాత్ర ఔచిత్యానికి తగ్గట్టుగానే ఆయన చిటికేసిన ప్రతిసారీ హీరోయిజం కనిపిస్తుంది.
ఇక మార్క్ పాత్రని ఆటపట్టిస్తూ పవన్ కల్యాణ్ చేసే హంగామా సినిమాకి ప్రధాన బలమని చెప్పాలి. లోతైన భావాలతో జీవిత సత్యాన్ని తెలిపేలా ఉంటూనే, ఆ ఆట మంచి వినోదాన్ని పంచుతుంది. క్లైమాక్స్ సీన్స్ సినిమాకి మరింత కీలకం. మార్క్ మనసుని తేలియక పరిచే ఆ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మన జీవితం, మరణం భావితరాల కోసమే, పుట్టుక మలుపు మరణం గెలుపు.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బ్రో.. ఫస్టాప్ లో వినోదం ప్రధానమైతే, సెంకడాఫ్ లో భావోద్వేగాలు కీలకం.
ఎవరెలా నటించారంటే....
సాయిధరమ్ తేజ్, పవన్‌కల్యాణ్ ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్. ఇద్దరి పాత్రలూ ఈక్వల్ గా ఆకట్టుకుంటాయి. పవన్ కల్యాణ్ అభిమానుల్ని మెప్పించే మేనరిజమ్స్‌తో అదరగొడితే, సాయిధరమ్ తేజ్ పాత్ర మంచి డ్రామాని పండిస్తుంది. సాయిధరమ్ తేజ్ ప్రేయురాలిగా కేతిక శర్మ కనిపించేది కొద్దిసేపే ఐనా ఓ పాటలో తన అందంతో అలరించింది కేతిక. ఇక ప్రియా వారియర్ పాత్ర ఆశ్చర్య పరుస్తుంది. రోహిణి, సుబ్బరాజు తదితరులు రెగ్యులరా పాత్రల్లోనే కనిపిస్తారు. బ్రహ్మానందం చిన్న పాత్రలో కనిపించారు. వెన్నెల కిశోర్, రోహిణి, తనికెళ్ల భరణి, అలీ రెజా తదితరులు వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు. తమన్ పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంటుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. త్రివిక్రమ్ రచన అభిమానుల్ని మెప్పించింది.
నోట్- ఈ రివ్యూ కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
(BRO Telugu Movie Review)