ఇంతవరకు ముఖానికి సబ్బు వాడలేదు
పెళ్లి గురించి అందుకే ఆలోచించలేదు - రాహుల్ గాంధీ
స్పెషల్ రిపోర్ట్- కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహూల్ గాంధీ (Rahul Gandhi) తన పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. అంతే కాదు తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్ లో పర్యటించిన సందర్భంగా జైపుర్ లోని మహారాణి కళాశాల (Maharani College) విద్యార్థినులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇందుకు సంబందించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదు, మీకు ఇష్టమైన ఆహారం ఏంటి, చర్మ సంరక్షణ కోసం మీరు ఏం చేస్తారు.. వంటి ప్రశ్నలకు రాహూల్ చాలా ఓపిగ్గా సమాధానం చెప్పారు.
ఇక అసలు విషయానికి వస్తే.. మీరు చాలా స్మార్ట్ గా, అందంగా ఉంటారు.. మరి పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదని ఓ యువతి రాహూల్ గాంధీని ప్రశ్నించగా.. తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో పెళ్లి వైపు వెళ్లలేదని రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. ఇక తనకు ఇష్టమైన ఆహారం గురించి చెబుతూ.. కాకరకాయ, బఠానీలు, బచ్చలికూర తప్ప మిగతావన్ని తింటానని చెప్పారు. ఇప్పటివరకు తాను వెళ్లని ప్రదేశాలే తనకిష్టమైన టూరిస్ట్ ప్లేస్ లని చెప్పుకొచ్చారు రాహూల్ గాంధీ. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తన ముఖానికి ఎప్పుడూ సబ్బు, క్రీం వాడలేదని.. కేవలం నీళ్లతోనే ముఖం కడుక్కుంటానని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను చూడటం తనకిష్టమని చెప్పారు రాహూల్ గాంధీ.