రామ్ చరణ్ కోసం హైదరాబాద్ వచ్చిన ముద్దుగుమ్మ
రామ్‌చరణ్ పక్కన నటించనున్న ఆ స్టార్ హీరోయిన్ కూతురు
మూవీ రిపోర్ట్- మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఉప్పెన (Uppena) ఫేమ్ సానా బుచ్చిబాబు (Sana Buchibabu) డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందేకదా. రామ్‌చరణ్ 16వ ప్రాజెక్ట్ గా ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడిగా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటించనుందని తెలుస్తోంది.
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) గుర్తుంది కదా. ఆమె కూతురు రాషా థడానీ (Rasha Thadani) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఓ హిందీ ప్రాజెక్ట్ ను ఓకే చేసిన రాషా థడానీ, తాజాగా రామ్ చరణ్ మూవీ లో నటించనుందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ ముద్దు గుమ్మ శుక్రవారం హైదరాబాద్ కు కూడా వచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. మెగా అభిమానులు రాషా థడానీ క్యూట్ గా ఉందని, హీరోయిన్ గా ఆమే ఫిక్స్ కావాలని సోషల్ మీడియా వేధికగా కోరుకుంటున్నారు.