Revanth KCR

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం- రేవంత్‌రెడ్డి

కేసీఆర్ కు ఇప్పటికైనా వాళ్లు గుర్తొచ్చారు సంతోషం- సీఎం రేవంత్

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు కోలుకోలేని విధంగా రాష్ట్ర ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనతో రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి. పదేళ్ల తర్వాతైనా వ్యవసాయం, రైతులు గుర్తొచ్చి ఇప్పటికైనా పొలం బాట పట్టినందుకు సంతోషమని రేవంత్ రెడ్డి అన్నారు.

లోక్‌ సభ ఎన్నిలకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని తెలిపారు. తుక్కుగూడలో ఏప్రిల్‌ 6 నిర్వహించనున్న జనజాతర సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి పరిశీలించిన తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారుజనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో పాటు రాహూల్, ప్రియాంక గాంధీలు హాజరవుతున్నారు.

 

 


Comment As:

Comment (0)