Made In Heaven

రొమాంటిక్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘మేడిన్‌ హెవెన్‌’. 

పెళ్లికూతురిగా సీతారామం హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌

మూవీ రిపోర్ట్- రొమాంటిక్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌ మేడిన్‌ హెవెన్‌ (Made in Heaven). మొదటి సీజన్ భారీ సక్సెస్ సాధించడంతో సీజన్‌ 2ని తెరకెక్కిస్తున్నారు. సంపన్నుల పెళ్లిళ్లు, అత్యంత ఆడంబరమైన వివాహాల వెనకున్న ముచ్చట్ల కథాంశాలతో తెరకెక్కిన మేడిన్‌ హెవెన్‌ లో సీతారామం ఫేం మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), రాధికా ఆప్టే, శిబానీ దండేకర్‌, సారా జేన్‌ డయాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సిరీస్ కు సంబందించిన లుక్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. ప్రధానంగా ఇందులో మృణాల్‌ ఠాకూర్ ఎరుపు రంగు లెహెంగాలో మెరిసిపోతూ పెళ్లికూతురు గెటప్ లో చాలా అందంగా కనిపించింది. చేతుల నిండుగా హెన్నా పెట్టుకొని, మెడను చుట్టేసే నెక్లెస్‌ ధరించి చూపరులను ఆకట్టుకుంది.


Comment As:

Comment (0)