రామ్- బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న స్కంద
పంచ్ డైలాగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు..రామ్ ‘స్కంద’.. ట్రైలర్ అదిరిపోయింది
మూవీ రిపోర్ట్- స్కంద (Skanda).. రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీను (Boyapati Strinu) కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్. తాజాగా స్కంద మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. హీరో రామ్ చెప్పే పంచ్ డైలాగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇక రామ్, శ్రీలీల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యువతను కట్టిపడేశాలా ఉన్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల అవుతోంది. బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో స్కంద సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Skanda Telugu Movie Trailer.