Raithu Bharosa

రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను ప్రారంభించిన సర్కార్ 

రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. రైతు భరోసా (Raithu Bharosa) కోసం ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు. దీంతో గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఒక ఎకరం నుంచి మొదలు విడతల వారిగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అధికారులు.


Comment As:

Comment (0)