జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బలో కలకలం
అనుమానాస్పద స్థిలో అక్క మృతి... చెల్లి అదృశ్యం
క్రైం రిపోర్ట్- సాఫ్ట్‌వేర్ ఇంజినీరైన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆమె చెల్లెలు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. జగిత్యాల (Jagityal) జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బలో ఈ ఘటవ చోటుచేసుకుంది. భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి(24), చందన, ఒ కొడుకు సాయి సంతానం. దీప్తి (Deepthi) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తుండగా, కొన్నాళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంగో ఇంటి నుంచే పని చేస్తోంది. చందన (Chandana) బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. కొడుకు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం బంధువుల గృహప్రవేశం ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి హైదరాబాద్ కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు చివరిసారిగా వారిద్దరూ కుమార్తెలతో ఫోన్ లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే సమయంలో చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి ఫోన్ చేసి విచారించగా వాళ్లు వచ్చి చూడగా దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దీప్తి మృతదేహం హాల్ లో సోఫాలో పడి ఉండగా, కిచెన్ లో రెండు మద్యం సీసాలు, కూల్ డ్రింక్ బాటిల్, ఆహార పదార్దాల ప్యాకెట్లు కనిపించాయి. ఐతే ఆమె చెల్లి చందన ఇంట్లో కనిపించలేదు. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్ లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. చందన, ఆమె వెంటున్న యువకుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి, ఇంకెవరైనా వచ్చి మద్యం తాగారా, చందన ఎందుకు పారిపోయిందనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చందన ఆచూకి దొరికితే గాని అక్క దీప్తి హత్య కేసు ఛేదించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.