CM CKR

సీఎం కేసీఆర్‌ కు వివాహ వేడుకలో అపూర్వ స్వాగతం 

కేసీఆర్‌ రావాలి.. కేసీఆర్‌ కావాలి - పెళ్లి వేడుకలో కామారెడ్డి ప్రజల నినాదాలు

హైదరాబాద్ రిపోర్ట్- ఓ వివాహ వేడుకకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు అపూర్వ స్వాగతం లభించింది. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు కేసీఆర్ రావాలి.. కేసీఆర్ కావాలి అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరైన సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని ముఖ్యమత్రి కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గానికి రావాలని కోరుతూ, పెళ్లికి హాజరైన ప్రజలు, యువత, మహిళలు భారీ ఎత్తున నినాదాలు చేసి.. కేసీఆర్ కు అనూహ్య రీతిలో స్వాగతం చెప్పారు.

సీఎం కేసీఆర్ పెళ్లి మండపానికి వెళ్లే టైంలో.. సీఎం కేసీఆర్‌ రావాలి.. స్వాగతం.. కామారెడ్డికి స్వాగతం.. కేసీఆర్‌ రావాలి.. కేసీఆర్‌ కావాలి..  జై కేసీఆర్‌.. దేశ్‌ కీ నేత కేసీఆర్‌.. అనే నినాదాలతో పెళ్లి ప్రాంగణం మారుమ్రోగింది. పెళ్లికి వచ్చిన వారితో కరచాలనం చేస్తూ, వారితో ఫొటోలు దిగుతూ, పెళ్లి మండపానికి వెళ్లేంత వరకు అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. ఇలా ఓ పెళ్లి వేడుకలో ఇలాంటి స్వాగతం లభించడం అరుదని పార్టీ నేతలు చెబుతున్నారు.


Comment As:

Comment (0)