తెలుగు రాష్ట్రాల్లో మధ్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
హైదరాబాద్ రిపోర్ట్- మధ్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓవైపు ఎండలు మండిపోతుంటే.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మందు బాబులు వైన్స్ (Wine Shops) ముందు బారులు తీరుతున్నారు. ఎండ వేడికి.. కొంచెం చల్లని బీర్లు తాగి వేసవి తాపాన్ని తీర్చుకుందామనుకుంటే.. ఆ బీర్లు కూడా దొరకటం లేదని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైన్ షాపులు ముతపడనున్నాయి. లోక్ సభ ఎన్నికల (Loksabha Elections 2024) పర్వం చివరి దశకు చేరుకోగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను మే 13న పోలింగ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కు ముందు 48 గంటల ముందుగా అంటే మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ రోజైన మే 13న సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతే కాకుండా ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే రోజు జూన్ 4న కూడా వైన్ షాపులు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులతో పాటుగా వివిధ జిల్లాలు, నగరాల్లో బార్లు, కల్లు కాపౌండ్ కూడా మూసేయనున్నారు.