calf 8 legs

అయోధ్యలో వింత ఘటన-8 కాళ్లతో పుట్టిన దూడ

అయోధ్యలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. మోద్రా కర్మ చౌరహా గ్రామంలో ఓ రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ ఎనిమిది కాళ్ల వింత దూడను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వింత దూడను పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడతాయని చెప్పారు. అయోధ్యసో జరిగిన ఈ ఘటన స్థానికులతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 


Comment As:

Comment (0)