హైదరాబాద్ లో రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (johnny master) పై సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టం కింద కూడా కేస్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా సెర్చ్ చేయగా.. ఎట్టకేలకు గోవాలో చిక్కాడు. గోవాలో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.
విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. ఇప్పటికే పలుమార్లు బాధితురాలైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను విచారించిన పోలీసులు, జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను ఎఫ్‌ఐఆర్‌లో యాడ్ చేశారు. ఇక జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఆయన్ను అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్ అరెస్ట్ చేసినట్టు సమాచారం.