యూఏఈ మెగా ప్రైజ్ మనీ లక్కీ డ్రాలో తొలి విజేత
25 ఏళ్లపాటు.. ప్రతి నెలా 5.5 లక్షలు.. యూపీ వాసిని వరించిన అదృష్టం
ఇంటర్నేషనల్ రిపోర్ట్- ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. ఎలాంటి పనిచేయకుండానే నెలనెలా లక్షల రూపాయలు.. అది కూడా ఏకంగా 25 సంవత్సరాల పాటు వస్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫాస్ట్ 5 (FAST 5) పేరుతో నిర్వహించిన లక్కీ లాటరీలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వాసి ఒకరు మెగా ప్రైజ్ మనీ గెలిచాడు
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ (Mohammad Adil Khan) దుబాయ్ (Dubai) లోని ఓ రియల్‌ఎస్టేట్ కంపెనీలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల యూఏఈ ఫాస్ట్ 5 (FAST 5) పేరిట లాటరీ తీసింది. ఆ మెగా ప్రైజ్ మనీ డ్రాలో అతడు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు నిర్వాహకులు. ఆ ప్రైజ్ మనీ ప్రకారం విజేతకు నెలకు 25,000 దిర్హమ్‌లు.. అంటే మన రూపాయల్లో ఐతే 5,59,822 చొప్పున 25 సంవత్సరాలు ఇస్తారు. ఇంకేముంది విజేతగా నిలిచిన ఆదిల్ ఖాన్ ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి.