డాక్టర్లు చెప్పినా వినకుండా రష్మిక ఏంచేసిందో తెలుసా?
రష్మిక మందన (Rashmika),ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ మూవీ థామా (Thamma). ఈ మధ్యనే అట్టహాసంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఎప్పటిలాగే రష్మిక మందన్న అందాలు యువతను మంత్రుముగ్ధులను చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తుమ్ మేరీ నా హుయే పాటలో రష్మిక తనదైన డ్యాన్స్ తో అదరగొట్టేసింది. ఈ సందర్బంగా రష్మిక తనకు సంబందించిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. తన కాలికి ఫ్యాక్చర్ అయినా కూడా ఆ పాట షూటింగ్ ను పూర్తి చేసినట్లు చెప్పింది రష్మిక. ఈ ఏడాది జనవరిలో తాను జిమ్ లో వర్కవుట్ చేస్తూ గాయపడినట్లు రష్మిక తెలిపారు. కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన వల్ల ఆలస్యమవుతున్న ప్రాజెక్టులకు సంబందించిన దర్శకులకు క్షమాపణలు తెలిపింది.
తన కాలికి గాయమైన కారణంగా డాక్టర్లు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని రష్మిక చెప్పారు. అయినా అప్పుడు ఛావా మూవీ ప్రమోషన్స్ కోసం 30 రోజులు తిరుగుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఐతే కాలి నొప్పి తీవ్రమవడంతో మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. ఆయన విషయం తెలుసుకుని తనను మందలించారని చెప్పారు రష్మిక. కాలు బాగా వాచి, పూర్తి రూపు మారిపోయిందని చెప్పుకొచ్చింది. తానీ అప్పటికే పాటకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావడంతో ఆ నొప్పితోనే థామా లో సాంగ్ పూర్తి చేశానని తెలిపింది రష్మిక. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తుంటే అప్పుడు తాను పడిన బాధ పెద్దదిగా అనిపించడం లేదని, ఎందుకంటే తాను ఏది చేసినా ప్రేక్షకుల కోసమేనని, వారి ముఖాల్లో ఆనందం నింపడం కోసమేనని చెప్పుకొచ్చింది రష్మిక మందన.