Vyomika Singh

సోఫియా ఖురేషి-వ్యోమికా సింగ్ పేరుతో ఫేక్ అకౌంట్లు

పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన తర్వాత భారత ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ (Sofia Qureshi), నేవీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Vyomika Singh) ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. పాక్ ఉగ్రస్థావరాల మీద దాడి ఘటన గురించి మీడియాకు వివరించడం ద్వారా వీరిద్దరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పాక్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఎప్పటికప్పుటి మీడియా సమావేశం పెట్టి సమాచారం ఇస్తూవస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి పేరు మీద పలు ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు పట్టుకొచ్చాయి. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ఫోటోలతో ఈ అకౌంట్లు ఎక్స్ లో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా వాటికి బ్లూటిక్ కూడా ఉండడంతో ఈ అకౌంట్లు నిజమేననుకుని నమ్మి చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ల ఎక్స్ అకౌంట్స్ నకిలీవిగా గుర్తించింది. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచించింది పీఐబీ.
 


Comment As:

Comment (0)