విశాఖపట్నంలో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం 

విశాఖపట్నం (visakhapatnam) లోని ఆర్కే బీచ్‌ (RK Beach) లో అరుదైన దృశ్యం కనిపించింది. సముద్రం సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రం చూసేందుకు వెళ్లిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా విశాఖలోని ఆర్కే బీచ్ లో కడలి అలలతో ఆడుకోావలని చాలా మంది వెళ్తుంటారు. కానీ హఠాత్తుగా సముద్రం 400 మీటర్లు వెనక్కి వెళ్లడంతో బీచ్ లో శిలలు కనిపించాయి. దీంతో పర్యాటకులు విశాఖ ఆర్కే బీచ్ తీరంలో బయటపడ్డ శిలలపై చేరి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. అయితే సాగర కదలికలు గమనించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉన్నట్లుండి సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లిందన్నదానిపై నిపుణులు ఆరా తీస్తున్నారు.


Comment As:

Comment (0)