Crime

యువతితో సహజీవనం చేస్తున్న భర్తను పోలీసులకు పట్టించిన భార్య

గదిలో యువతితో కానిస్టేబుల్‌.. పోలీసులకు పట్టించిన భార్య

గుంటూరు రిపోర్ట్- ఈ మధ్య కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. దీంతో కుటుంబాల మధ్య చిచ్చు రేగుతోంది. తాజాగా మరో అక్రమ సంబంధం బయటపడటంతో కలకలం రేగుతోంది. మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య పోలీసులకు పట్టించింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ లో కత్తి శ్రీను అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లై పిల్లులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ యువతితో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో కానిస్టేబుల్‌పై ఆయన భార్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా  గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. దీంతో కానిస్టేబుల్‌ శ్రీనును పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.

 


Comment As:

Comment (0)