Babu bail

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట

టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ 

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu) మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన న్యాయమూర్తి ఈరోజు తీర్పు వెలువరించారు. హైకోర్టు జడ్డ్ జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు చంద్రబాబుకు సంబందించిన బెయిల్ పిటీషన్ పై తీర్పు వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మల్లిఖార్జున రావు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు. చంద్రబాబు కు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


Comment As:

Comment (0)