APPSC

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 తుది ఫలితాలు రిలీజ్

గ్రూప్‌-1 తుది ఫలితాల విడుదల- టాప్‌ 5 ర్యాంకర్లు

అమరావతి రిపోర్ట్-  ఏపీపీఎస్సీ (APPSCE) - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 (Group-1) తుది ఫలితాలు వెలువడ్డాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్ గురువారం సాయంత్రం గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల తరువాత గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 111 ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయగా.. వీరిలో 39 మందిని స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక చేశారు. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 16 ప్రభుత్వ విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్సు కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ చెప్పారు. గ్రూప్‌-1 లో తొలి 3 ర్యాంకులు మహిళా అభ్యర్థులే సాధించడం విశేషం.

ఏపీపీఎస్సీ గ్రూప్-1లో టాప్‌ 5 ర్యాంకులు సాధించినవారు..
మొదటి ర్యాంకు - భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
రెండో ర్యాంకు - భూమిరెడ్డి భవాని
మూడో ర్యాంకు - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
నాలుగో ర్యాంకు - ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి 
ఐదో ర్యాంకు - భాను ప్రకాష్ రెడ్డి.

మిగతా ర్యాంకర్ల వివరాలు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. APPSC Group-1 Results.


Comment As:

Comment (0)