భువనేశ్వరి, బ్రాహ్మణి లకు సంఘీభావం తెలిపిని అశ్వనీదత్
ఎన్నికల్లో చంద్రసేనకు 160 సీట్లు ఖాయం - నిర్మాత అశ్వనీదత్
స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Janasena) కూటమికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ (Ashwini Dutt) చెప్పారు. చంద్రబాబు లాంటి మహానాయకుడిని జైల్లో పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. మహా నాయకుడిని జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా.. అని అశ్వనీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి లను కలిసి సంఘీభావం తెలిపారు అశ్వనీదత్. ఏ తప్పు చేయని చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారని ఆయన అన్నారు.