Chandrababu Jail

ఎండల వేడికి తట్టుకోలేకపోతున్న చంద్రబాబు

జైల్లో డీహైడ్రేషన్ కు గురైన చంద్రబాబు

రాజమహేంద్రవరం రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ (Rajamahendravaram Central Jail) లో డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ములాఖత్ సందర్బంగా కుటుంబ సభ్యులకు ఆయన చెప్పినట్లు సమాచారం. గత నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురైనట్లు డాక్టర్లు చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు ఉన్న గదికి కేవలం ఫ్యాన్ మాత్రమే ఉంది. ఏసీ సౌకర్యం లేదు. దీంతో ఎండల తీవ్రతకు చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ (TDP) శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Comment As:

Comment (0)