చంద్రబాబుకు 14 రోజుల కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ - రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు
అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించంది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు (Rajamahendravaram Central Jail) తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబును రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం తీసుకెళ్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, హెలికాప్టర్ లేదంట్ విమానంలో తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వరకు రోడ్డు మార్గంలో తీసుకెళ్లి, అక్కడు నుంచి విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జైలుకు తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్దం చేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో 144 సెక్షన్ అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.