Chandrababu Court

దీపావళి తరువాతే స్కిల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు

ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయవద్దు- సుప్రీంకోర్టు ఆదేశం

న్యూ ఢిల్లీ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఫైబర్‌ నెట్‌ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈ కేసుపై ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, అనిరుద్ధ బోస్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన  ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈనెల 23కు వాయిదా వేయాలని ముందు ధర్మాసనం నిర్ణయించంగా, సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

మరో వైపు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుకు సంబందించిన క్వాష్ పిటీషన్ పై ఇప్పటికే విచారణ పూర్తవ్వగా, తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో చంద్రబాబుకు సంబందించిన కేసుల్లో తీర్పు ఎలా ఉండబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెక్షన్‌ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్‌ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు ముగిసేవరకూ అరెస్ట్‌ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు.


Comment As:

Comment (0)