నీరజ్ చోప్రాతో ప్రేమ.. స్పందించిన మను బాకర్
షూటర్ మను బాకర్ (Manu Bhaker) పారిస్ ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. 22 ఏళ్ల మను బాకర్ కు ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ అమ్మాయి ఏం మాట్లాడినా, ఏం చేసినా అది వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) తో మను బాకర్ కలిసి ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో మను బాకర్, నీరజ్ చోప్రా ఇద్దరూ సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించింది.
అంతే కాదు మను భాకర్ తల్లి నీరజ్ చోప్రా తో మాట్లాడడం, ఆమె తలపై నీరద్ చేతిని ఉంచి ఒట్టు వేయించుకున్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మను భాకర్ నీరజ్ ఛోప్రాతో ప్రేమలో పడిందని, త్రవలోనే వాళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే చర్చ మొదలైంది. తమ కూతురు మను భాకర్ ను పెళ్లి చేసుకోవాలని వాళ్ల తల్లి నీరజ్ ను కోరినట్లు ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. ఈ ఊహాగానాలను ఇప్పచికే మను బాకర్ కుటుంబ సభ్యులు ఖండించారు. ఇదిగో ఇప్పుడు మను బాకర్ సైతం ఈ ఉహాగానాలపై స్పందించింది.
మను భాకర్ ఏమన్నారంటే.. నేను కూడా ఈ రూమర్స్ విన్నాను.. వీటిపై నన్ను క్లారిటీ ఇవ్వనివ్వండి.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. నీరజ్‌తో మాట్లాడాను.. దాన్ని అనుకోకుండా ఎవరో వీడియో తీశారు.. మా మధ్య అంతగా ఇంటరాక్షన్ లేదు.. పలు పోటీలు, ఈవెంట్లలో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటాం.. అంతే కానీ మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు.. మా అమ్మ నీరజ్‌తో మాట్లాడినప్పుడు నేనక్కడ లేను.. కాబట్టి వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో నేను చెప్పలేను.. అని మను బాకర్ చెప్పుకొచ్చింది. అదన్న మాట సంగతి.