Balakrishna

హిందూపురంలో పర్యటించిన నందమూరి బాలకృష్ణ

తెలుగుదేశం,జనసేన పొత్తు కొత్త శకానికి నాంది- బాలకృష్ణ

హిందూపురం రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Janasena) పార్టీల పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం ఇన్ని సీట్లు, అన్ని సీట్లని కాకుండా తెలుగుదేశం-జనసేన కూటమి గెలవాలని అన్నారు. తాను, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముక్కుసూటిగా మాట్లాడుతామన్న బాలకృష్ణ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, పరిపాలన మొత్తం నేరస్థులు, హంతకుల చేతుల్లో ఉందని బాలకృష్ణ విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఇష్టారాజ్యంగా సాగుతోందన్న బాలయ్య.. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలని అన్నారు. రాష్ట్రంలో ఒక్క హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని, గత నాలుగున్నరేళ్లలో ప్రతిపక్షంలో ఉండే తాము అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ప జగన్రి కు పాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గురువారం సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ.. స్థానిక ప్రభుత్వ  ఆసుపత్రిని పరిశీలించారు. హిందూపురంలో టీడీపీ కార్యకర్త పెళ్లి వేడకలో పాల్గొని సందడి చేశారు బాలయ్య.


Comment As:

Comment (0)