Lokesh Nara TDP

చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేశ్, భువనేశ్వరి

చంద్రబాబును చంపేస్తామని భహిరంగంగానే చెబుతున్నారు- నారా లోకేశ్‌

రాజమహేంద్రవరం రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో (Chandrababu) నారా లోకేశ్ (Nara Lokesh), నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చాక లోకేశ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును జైలులో బంధించి 50 రోజులైందని, ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని లోకేశ్‌ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును ప్రజల మధ్యకు రానీవ్వకుండా కుట్ర చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు చనిపోవాలి, చంద్రబాబును చంపేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భహిరంగంగానే చెబుతున్నారని లోకేశ్ అన్నారు. కేసుతో సంబంధం లేని తన తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారని చెప్పారు. జైలు నుంచి చంద్రబాబును బయటకు రానివ్వకుండా అడ్వకెట్ల ఫీజుకు కోట్లు ఖర్చు పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. 


Comment As:

Comment (0)