Malika Garg

ఒంగోలులో భూ కుంభకోణంలో కీలక పరిణామం

ప్రకాశం ఎస్పీకి సీఎం కార్యాలయం నుంచి పిలుపు

అమరావతి రిపోర్ట్- ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు (SP Malika Garg) ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కార్యాలయం నుంచి పిలుపొచ్చింది ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒంగోలు భూ కుంభకోణానికి సంబందించి పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీ మలికా గార్గ్ కు సమాచారమిచ్చారు సీఎంఓ అధికారులు. దీంతో అందుకు సంబంధిత ఫైలుతో మలికా గార్గ్‌ అమరావతి వెళ్లారు.   

నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లతో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయన్న బాధితుల ఫిర్యాదుతో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దర్యాప్తు ప్రారంభించింది ప్రభుత్వం. ఈ కేసు అధికార వైసీపీ ముఖ్యనేతలకు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) మధ్య అంతర్గత పోరుకు తెరలేపింది. దీంతో ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి పోలీసల తీరుకు నిరసన తెలిపారు. 

ఇదే విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని సీఎంఓ కు పిలిపించి మాట్లాడారు. ఈ కేసు సంగతి తేల్చేలా జిల్లా అధికారులను ఆదేశించాలంటూ బాలినేని పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా ఎస్పీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలు భూకుంభకోణం ఏ మలుపు తిరుగుతుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 


Comment As:

Comment (0)