Sake Bharathi

కూలి చేస్తూ పీహెచ్‌డీ చేసిన సాకే భారతి.. ఉద్యోగం కోసం ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంటే

స్పెషల్ రిపోర్ట్- కూలీ పనులు చేస్తూ పీహెచ్ డీ (Phd) చేసి ఔరా అనిపించింది అనంతపురం (Ananthapuram) జిల్లాకు చెందిన సాకే భారతి (Sake Bharati). శింగనమల మండలం నాగులగుడ్డంకు చెందిన సాకే భారతి కూలీ చేస్తూనే రసాయన శాస్త్రంలో ఇటీవల పీహెచ్‌డీ పట్టా అందుకుంది. ఆమెను చూసి అంతా ఆశ్చర్యపోతూనే, ఆమె పట్టుదలను ప్రశంసిస్తున్నారు. ఐతే సాకె భారతి అంత కష్టపడి చదివి పీహెచ్ డీ చేసినా ఆమెకు మాత్రం తగిన ప్రోత్సాహం మాత్రం లభించడం లేదు. ఉద్యోగం ఇప్పించాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda padmavathi) కాళ్లు పట్టుకొని వేడుకుంటే గెంటేశారని ఆమె ఆవేధన వ్యక్తం చేస్తోంది.

తన భర్త శివప్రసాద్‌ తో కలిసి ఏడాదిన్నర కిందట ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి, ఎస్కేయూలో పీహెచ్‌డీ చేస్తున్నా, అక్కడ బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లింది భారతి. మీరు చెబితే ఇస్తారని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని వేడుకున్నామని, పూర్తి వివరాలు రాసివ్వాలని కోరగా అందిచాంరు. మరుసటి రోజు తన భర్త వెళ్తే ఎమ్మెల్యే బయటకు గెంటించారని కన్నీళ్లపర్వంతం అయ్యింది భారతి. చివరికి తల దాచుకోవడానికి ఇల్లు అడిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

 


Comment As:

Comment (0)