Vangaveeti Radha

అక్టోబర్ 22న వివాహం

అంగరంగవైభవంగా వంగవీటి రాధా వివాహ నిశ్చితార్థం

స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) వివాహ నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narasapuram) మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల రెండవ కూతురు పుష్పవల్లితో (Pushpavalli) రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం జరిగింది. నరసాపురంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అక్టోబరు 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు వంగవీటి రాధ, పుష్పవల్లి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Comment As:

Comment (0)